ఆగస్ట్ లో ఎన్ని జాబ్స్ పోయాయో తెలుసా…?

-

మార్చ్ చివరి నుంచి దేశంలో కఠినమైన లాక్డౌన్ విధించినప్పటి నుండి భారత అధికారిక రంగ నిరుద్యోగం తీవ్రంగా పెరుగుతోంది. కన్స్యూమర్ పిరమిడ్స్ హౌస్‌హోల్డ్ సర్వే (సిపిహెచ్‌ఎస్) లెక్కల ప్రకారం మే మరియు ఆగస్టు మధ్య దాదాపు 6.6 మిలియన్ లేదా 66 లక్షల వైట్ కాలర్ నిపుణులు (డబ్ల్యుసిపి) ఉద్యోగాలు కోల్పోయినట్లు వెల్లడించింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, వైద్యులు, ఉపాధ్యాయులు, అకౌంటెంట్లు మరియు విశ్లేషకులు వంటి వైట్ కాలర్ నిపుణులు మహమ్మారి బారిన పడిన ఉద్యోగులందరిలో అతిపెద్ద ఉద్యోగ నష్టాన్ని ఎదుర్కొన్నారని సర్వే వివరించింది.

వైట్ కాలర్ నిపుణులు గత ఏడాది ఎక్కువగా ఉద్యోగాల్లో చేరినట్టుగా నివేదికలు వెల్లడించాయి. అటువంటి నిపుణుల ఉపాధి భారత్ లో 2019 మే-ఆగస్టులో 18.8 మిలియన్ లేదా 1.88 కోట్లకు చేరుకుంది. 2020 జనవరి-ఏప్రిల్‌లో ఈ సంఖ్య క్రమంగా 18.1 మిలియన్లకు లేదా 1.81 కోట్లకు పడిపోయిందని లెక్కలు చెప్పాయి.

Read more RELATED
Recommended to you

Latest news