ధోనీకి స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన సీఎస్‌కే.. ఏమిటో తెలుసా..?

ఐపీఎల్ 13వ ఎడిష‌న్ ప్రారంభానికి మ‌రికొద్ది గంటల స‌మ‌యం మాత్ర‌మే మిగిలి ఉంది. ఈ నేప‌థ్యంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్‌కే) జ‌ట్టు యాజ‌మాన్యం త‌మ ప్లేయ‌ర్ల‌కు తాజాగా బ‌హుమ‌తుల‌ను అంద‌జేసింది. అలాగే ప్లేయ‌ర్లందరికీ చ‌క్క‌ని విందు ఏర్పాటు చేసింది. ఇక ప్లేయ‌ర్లంద‌రికీ ప్ర‌త్యేకంగా త‌యారు చేయించిన గిఫ్ట్‌ల‌ను సీఎస్‌కే అంద‌జేసింది. ఈ క్ర‌మంలోనే సీఎస్‌కే ప్లేయ‌ర్లు ర‌వీంద్ర జ‌డేజా, షేన్ వాట్సన్‌లు త‌మ‌కు ఇచ్చిన గిఫ్ట్‌ల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. అయితే సీఎస్‌కే జ‌ట్టు ధోనీకి కూడా ఓ ప్ర‌త్యేక‌మైన గిఫ్ట్‌ను ఇచ్చింది.

chennai super kings surprise gift to dhoni

కాగా ధోనీకి త‌న‌కు చెన్నై జ‌ట్టు యాజ‌మాన్యం అంద‌జేసిన ఆ గిఫ్ట్ వివ‌రాల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌లేదు. కానీ చెన్నై ఫ్రాంచైజీ అందుకు సంబంధించి ఓ ట్వీట్ చేసింది. అందులో ధోనీకి ఇచ్చిన గిఫ్ట్ ఏమిటో చెప్పేసింది. ధోనీకి ఆ టీం బంగారు క్యాప్‌ను అంద‌జేసింది. ఆ జ‌ట్టు హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌, టీం ఫీల్డింగ్ కోచ్ రాజీవ్ కుమార్ లు ధోనీకి గోల్డెన్ క్యాప్‌ను అంద‌జేశారు. ధోనీ మొద‌ట్నుంచీ త‌మ టీంకు అందించిన సేవ‌ల‌కుగాను అత‌నికి ఆ గిఫ్ట్‌ను అందించిన‌ట్లు చెన్నై టీం తెలియ‌జేసింది.

కాగా ఐపీఎల్ 13వ ఎడిష‌న్ ఆరంభ మ్యాచ్‌లో చెన్నై, ముంబై జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. గ‌తేడాది జూలై నుంచి ధోనీ కాంపిటీటివ్ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఈ క్ర‌మంలో ఈ మ్యాచ్ లో అత‌ను ఎలాంటి ప్ర‌ద‌ర్శ‌న చేస్తాడన్న విష‌యం ఆస‌క్తిక‌రంగా మారింది.