బడ్జెట్ 2022 ఎవరి మీద ఎంత ప్రభావం చూపనుందంటే..?

-

ఫిబ్రవరి 1న బడ్జెట్ ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ కొత్త బడ్జెట్ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ బడ్జెట్ పై ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ రైతులకు, వ్యవసాయానికి, టెక్నాలజీకి, రక్షణ రంగానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారు. 39.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. అయితే ఏ రంగాలపై ఎలాంటి ప్రభావం చూపించనుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రాన్స్పోర్ట్:

నాలుగు వందల కొత్త వందే భారత్ రైళ్లలో పెట్టుబడుల కోసం ప్రణాళిక వేశారు, మూడేళ్లలో రిమోట్ రోడ్లు నగరాల్లో మాస్ రవాణా కూడా తీసుకురానున్నారు. దీనితో లార్సన్ అండ్ టుబ్రో లిమిటెడ్, జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్, ఐఆర్బీ ఇన్ఫ్రా లిమిటెడ్, కంటైనర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, అల్‌కార్గో లాజిస్టిక్స్ లిమిటెడ్, ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ వారికి ప్రయోజనం కలగనుంది.

ఈవి బ్యాటరీ మేకర్స్:

ఎలక్ట్రిక్ వాహనాలు కోసం కొత్త స్వాపింగ్ విధానం నుండి బ్యాటరీ తయారీదారులు లాభం పొందుతారు. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, అమరరాజా బ్యాటరీస్ లబ్ధిదారులు ఉన్నారు.

సోలార్:

సోలార్ మాడ్యూల్స్ ప్రోత్సాహానికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ కింద 195 బిలియన్ రూపాయలు కేటాయించారు. టాటా పవర్ లిమిటెడ్, సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వారు ప్రయోజనాన్ని పొందనున్నారు.

సిమెంట్:

అల్ట్రాటెక్ సిమెంట్, అంబుజా సిమెంట్, బిర్లా సిమెంట్ వంటి కంపెనీలకు ప్రయోజనకరంగా ఉంది. తక్కువ ఆదాయం పొందే వారికి ప్రభుత్వం ఇల్లు నిర్మించనుంది కనుక వీళ్ళు ప్రయోజనాన్ని పొందనున్నారు. అలానే మెటల్స్ లో చూస్తే వేదాంత లిమిటెడ్, టాటా స్టీల్ లిమిటెడ్, జేఎస్‌డబ్ల్యు స్టీల్ లిమిటెడ్, జిందాల్ స్టీల్ స్టెయిన్ లెస్ స్టీల్ లిమిటెడ్ వారికి ప్రయోజనం కలగనుంది.

డిజిటల్ ఫైనాన్స్:

పాలసీ బజార్ మాతృసంస్థ పీబీ ఫిన్ టెక్ లిమిటెడ్, న్యూలీ లిస్టెడ్ పేటీఎం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్, ఈ-క్లర్క్ సర్వీసెస్ లిమిటెడ్, పైసాలో డిజిటల్ లిమిటెడ్ కి లాభం కలగనుంది.

టెల్కోస్, డేటా సెంటర్స్:

5జీ కోసం ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. దీనితో భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, వొడాఫోన్ ఐడియా లిమిటెడ్, మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్, HDFCL లిమిటెడ్, తేజాస్ నెట్ వర్క్స్ లిమిటెడ్, స్టెరిలైట్ టెక్నాలజీ లాభపడుతాయి.

డిఫెన్స్ ఉత్పత్తులు:

లార్సన్ అంట్ టుబ్రో లిమిటెడ్, భారత్ ఫోర్జ్ లిమిటెడ్, పరాస్ డిఫెన్స్, స్పెస్ టెక్నాలజీ లిమిటెడ్ ప్రయోజనం కలగనుంది. డ్రోన్ స్టార్టప్స్ వల్ల జ్యూస్ న్యూమెరిక్స్, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, బోట్‌ల్యాబ్ డైనమిక్స్ ప్రయోజనం పొందుతాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news