ముంబయిలో విదేశీ కరెన్సీ పట్టివేత.. చీరలు, చెప్పుల్లో రూ.4కోట్లు

-

ముంబయి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. ఓ ఫ్యామిలీ ఫ్యామిలీ తమ బ్యాగుల్లో ఈ కరెన్సీ పట్టుకెళ్తూ కస్టమ్స్ అధికారులకు దొరికేసింది. ముంబయి నుంచి దుబాయ్​ వెళ్తున్న ముగ్గురు భారతీయుల నుంచి 4,97,000 డాలర్ల (సుమారు 4.1 కోట్ల రూపాయలు) నగదును కస్టమ్స్​ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బుధవారం ఉదయం పక్కా సమాచారం అందుకున్న ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ దుబాయ్‌కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులను అడ్డగించింది. అనుమానంతో వారి బ్యాగ్​లను పరిశీలించగా భారీ మొత్తంలో నగదు దొరికింది. వారు బ్యాగ్​లో, చెప్పులు, చీరల్లో ఈ నగదును దాచినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 4,97,000 డాలర్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ ముగ్గురిని అరెస్టు చేసి స్థానిక కోర్టు తరలించారు. న్యాయస్థానం ఆదేశాలతో జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news