ఒడిశాలో కొనసాగుతున్న ఐటీ దాడులు.. బయటపడుతున్న సంచుల కొద్దీ డబ్బు

-

ఒడిశాలో గత ఐదు రోజులుగా ఐటీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో కోట్ల కొద్ది డబ్బు బయటపడుతోంది. తవ్వినా కొద్ది డబ్బు సంచులు వెలుగులోకి వస్తున్నాయి. నాటుసారా తయారు చేసి విక్రయించేవారి ఇళ్లపై దాడులు చేస్తున్న ఐటీ అధికారులకు శుక్రవారం వరకు రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి రూ.225 కోట్లకుపైగా నగదు స్వాధీనం చేసుకున్నారు.

శుక్రవారం రాత్రి బొలంగీర్‌ జిల్లా సుధారపడ ప్రాంతంలో నాటు సారా తయారుచేసే సంస్థ మేనేజర్‌ ఇంట్లో చేసిన సోదాల్లో దొరికిన డబ్బును వెలికితీసి 20 సంచుల్లో ఉంచారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న ధనాన్ని 156 సంచుల్లో నింపి ఈ మొత్తాన్ని ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయానికి తరలించారు. బ్యాంకులో ఉన్న నోట్ల లెక్కింపు యంత్రాలతోపాటు ఇతర బ్రాంచుల్లో ఉన్న యంత్రాలనూ తీసుకొచ్చి శనివారం లెక్కించారు. ఈ క్రమంలో కౌంటింగ్ మెషీన్లే మొరాయిస్తున్నాయి.

మరోవైపు ఆ రాష్ట్రంలో ప్రముఖ నాటు సారా వ్యాపారిగా గుర్తింపున్న బొలంగీర్‌కు చెందిన బల్దేవ్‌ సాహుకు సంబంధించిన సంస్థలోను అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బొలంగీర్‌తోపాటు సంబల్‌పూర్‌, రవుర్కెలా, భువనేశ్వర్‌, సుందర్‌గఢ్‌ ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version