పీఎఫ్‌ఐ కేసు.. ఎన్ఐఏ అదుపులో వందల మంది అనుమానితులు

-

పీఎఫ్ఐ నాయకులకు చెందిన కార్యాలయాల్లో ఎన్ఐఏ, ఈడీ సంయుక్తంగా సోదాలు చేస్తోంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, అస్సాం, ఉత్తర్‌ప్రదేశ్‌, దిల్లీ, తెలంగాణ, కేరళ వంటి పలు రాష్ట్రాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. వందల మంది అనుమానితులను అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

దిల్లీ పోలీసులకు చెందిన ప్రత్యేక విభాగం దిల్లీలోని రోహిణి, నిజాముద్దీన్‌, జామియా, షహీన్ బాగ్‌, సెంట్రల్‌ దిల్లీలో దాడులు చేపట్టింది. 30 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ సమయంలో శాంతి భద్రతలకు ఆటంకం కలగకుండా జామియా విశ్వవిద్యాలయం పరిధిలో 144 సెక్షన్‌ విధించారు. అలాగే పారామిలిటరీ బలగాలను మోహరించారు. మహారాష్ట్రలోని జౌరంగాబాద్‌, సోలాపూర్‌లో సోదాలు కొనసాగుతున్నాయి. కర్ణాటక, అస్సాం, యూపీలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

ఇప్పటికే పీఎఫ్‌ఐ నేతల ఇళ్లు, కార్యాలయాల్లో జరిపిన దాడుల్లో 100 మందికి పైగా పీఎఫ్‌ఐ సభ్యులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అత్యధికంగా కేరళలో 22, మహారాష్ట్రలో 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సోదాల్లో ఎన్‌ఐఏ పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఈ సంస్థ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని, లష్కరే తోయిబా, ఐసిస్‌, అల్‌ఖైదా వంటి ఉగ్రముఠాల్లో చేరేలా యువతను ప్రేరేపిస్తోందని ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలింది.

Read more RELATED
Recommended to you

Latest news