World Cup 2023 : క్రికెట్ అభిమానులకు ఐసీసీ శుభవార్త చెప్పింది. వరల్డ్ కప్ సెమీఫైనల్ ఫైనల్, మ్యాచ్ లకు రిజర్వ్డ్ కేటాయించినట్లు తెలిపింది. షెడ్యూల్ ప్రకారం మ్యాచులు జరగకపోతే మరుసటి రోజు రిజర్వ్డ్ డే ఉండనుందని పేర్కొంది. కాగా, తొలి సెమీఫైనల్ రేపు ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరుగుతుంది.
ఈ నెల 17న జరిగే రెండో సెమీఫైనల్ లో దక్షిణాఫ్రికా – ఆస్ట్రేలియా జట్టు తలపడనున్నాయి. ఇక ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా ఈ నెల 19న జరగనుంది. కాగా, వన్డే వరల్డ్ కప్ లో అజయంగా దూసుకెళ్తున్న భారతజట్టు కీలక సమరానికి సిద్ధమవుతోంది. లీగ్ దశలో 9కి 9 మ్యాచులు గెలిచిన రోహిత్ సేన రేపు న్యూజిలాండ్ తో అమీతుమీ తేల్చుకోనుంది. ఫైనల్ బెర్తుపై కన్నేసిన టీమిండియా ముంబైలోని వాంకడే స్టేడియంలో నవంబర్ 15 బుధవారం మధ్యాహ్నం జరిగే తొలి సెమీఫైనల్లో కివీస్ ను మరోసారి ఓడించాలనే పట్టుదలతో ఉంది.