త్వరలోనే కొత్త హైదారాబాద్ నిర్మాణం చేసి చూపిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. అధికారంలో వచ్చాక..332 కిలో మీటర్ల రీజినల్ రింగ్ రోడ్డు నిర్మిస్తామన్నారు.తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ మీటింగ్ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్), రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) మధ్యలో కొత్త హైదారాబాద్ నిర్మాణం చేసి చూపిస్తామని తెలిపారు.
ఆర్ఆర్ఆర్ బయట కూడా కొత్త రింగ్ రోడ్డు, తెలంగాణ జిల్లాలకు వెళ్లే మార్గం సులభం చేయాలని ప్రయత్నం చేస్తున్నాం.. అభివృద్ధి, తెలంగాణ రాష్ట్ర ప్రగతి కొనసాగాలంటే కేసీఆర్ మళ్లీ రావాలని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఐటీలో హైదరాబాద్… బెంగుళూరును దాటేసిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. గతేడాది దేశంలో 4.50 లక్షల ఐటి ఉద్యోగాలు వస్తే 1.50 లక్షలు హైదరాబాదులో, 1.46 లక్షల జాబ్స్ బెంగుళూరులో వచ్చాయన్నారు. 1989లోనే హైదరాబాద్ కు తొలి ఐటి కంపెనీ ‘INTERGRAPH’ వచ్చిందని చెప్పారు. తెలంగాణలో 2014 వరకు 25 ఏళ్లలో రూ. 55 వేల కోట్ల ఐటి ఎగుమతులు జరిగితే….2022-23లోనే రూ. 57 వేల కోట్ల ఎగుమతులు సాధించాయని TBF సదస్సులో వివరించారు.