కరోనా టెస్టులపై ఇప్పటికే పలుమార్లు గైడ్ లైన్స్ ఇచ్చిన ఐసీఎంఆర్.. ఇప్పుడు మరోసారి గైడ్ లైన్స్ విడుదల చేసింది. ఇప్పటి వరకు ర్యాపిడ్ టెస్టులో పాజిటివ్ వస్తే.. కొందరు అనుమానంతో ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకుంటున్నారు. దీంతో టెస్టుల కోసం చాలాటైమ్ వేస్ట్ అవుతోంది.
ఇక ఇలాంటి వాటికి చెక్ పెట్టేలా ఒకసారి ఆర్ టీపీసీఆర్ లేదా ర్యాపిడ్ టెస్టులో పాజిటివ్ వస్తే.. మరోసారి టెస్టు చేయాల్సిన అవసరం లేదని ఐసీఎంఆర్ తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా ప్రయివేటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచేందుకు.. ర్యాట్ బూత్ లను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.
దీంతో పాటు అలాగే అంతర్రాష్ట్ర ప్రయాణాలు చేసే వారికి కొన్ని రాష్ట్రాల్లో టెస్టులు చేస్తున్నారని, అయితే లక్షణాలు లేని వారికి టెస్టులు చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. మొబైల్ టెస్టింగ్ వ్యాన్లను విరివిగా వాడుకుని.. టెస్టుల వేగం పెంచాలని ఆదేశించింది.