ఢిల్లీలో తాము అధికారంలోకి వస్తే.. వారికి ఉచిత కరెంట్, వాటర్ : కేజ్రీవాల్

-

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఓ వైపు అధికార ఆప్, మరోవైపు ప్రతిపక్ష బీజేపీ ప్రజలకు వరాల జల్లులు కురిపిస్తోంది. బీజేపీ మహిళలకు రూ.2500, రూ.500 ఉచిత గ్యాస్ వంటి పథకాలను ప్రవేశపెడితే.. ఇకకేజ్రీవాల్ గ్యారెంటీల పేరుతో ఆప్ మేనిఫెస్టో విడుదల చేసింది. పేద మహిళలకు పెన్షన్ రూ.2100 పెంచుతామని.. సంజీవని యోజన కింద 60 ఏళ్లు దాటిన ఉచిత ఆరోగ్యసేవలు,  ఆటో డ్రైవర్లకు రూ.15లక్షల వరకు ఆరోగ్య బీమా వంటి పథకాలను ప్రవేశపెట్టారు.

తాజాగా ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేజ్రీవాల్ కిరాయి దారులకు వరాల జల్లు కురిపించారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే.. దేశ రాజధానిలో అద్దె ఇళ్లలో నివసించే వారికి ఉచిత విద్యుత్, నీరు అందిస్తామని తెలిపారు. పూర్వాంచల్ కు చెందిన కౌలుదారులకు సైతం ఉచిత విద్యుత్, నీటి సౌకర్యాలు అందిస్తామని హామీ ఇచ్చారు. తాము ఉచిత పాఠశాలలు, ఆసుపత్రుల నుంచి ప్రయోజనం పొందుతున్నామని.. ఉచిత విద్యుత్, నీరు వంటి పథకాలకు దూరంగా ఉంటున్నామని కిరాయికి ఉండే వారు పేర్కొంటున్నట్టు వెల్లడించారు కేజ్రీవాల్.

Read more RELATED
Recommended to you

Latest news