జబల్ పూర్ గ్రామానికి దగ్గర్లో ఉన్న బద్రాజీ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మతి స్థిమితం చలించి రోడ్ల మీదే తిరుగుతున్నాడు. అయినా కానీ గ్రామ పంచాయతీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అతడి గురించి పట్టించుకోకపోవడం దారుణంకానీ ఇప్పుడు అది వైరల్ viral video గా మారింది.40 ఏళ్ల వయసున్న రాజారామ్ చక్రవర్తి అనే అతడు జబల్ పూర్ నుంచి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న బద్రాజీ గ్రామంలో మానసిక సమస్యలతో రోడ్ల మీద తిరుగుతున్నాడు. అతడు అలా రోడ్ల మీద తిరుగుతున్నా కానీ అక్కడి పంచాయతీ పట్టించుకోలేదు. అతడికి సరైన బట్టలు కూడా లేకపోవడం విచారకరం. ఏ కాలమైనా సరే అతడు అలాగే రోడ్ల మీద తిరుగుతున్నాడు. చిలకి వణుకుతూ ఎండకు తడుస్తూ అలాగే జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ మధ్యలో సోషల్ మీడియాలో ఇలా మతిస్థిమితం కోల్పోయి తిరుగుతున్న రాజారామ్ చక్రవర్తి ఫొటోలు వైరల్ గా మారడంతో అతడు మీడియా దృష్టిలో పడ్డాడు. మీడియా వారు వెళ్లి అక్కడి నాయకులను ప్రశ్నించగా… తాము ఇంతకాలం రాజారామ్ హాస్పిటల్ కు పంపనందుకు చింతిస్తున్నట్లు తెలిపారు. త్వరలో అతడిని మానసికి వైద్యశాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తామని అన్నారు.
రాజారామ్ చక్రవర్తి మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. ఇన్నాళ్లు అతడిని తన తల్లి దండ్రులే చూసుకునే వారు. కానీ అనుకోని కారణాల వలన మూడు నెలల కిందట అతడి తల్లి చనిపోయింది. మరింత బాధాకరమైన విషయం ఏంటంటే నెల కిందటే అతడి తండ్రి కూడా చనిపోయాడు. ప్రస్తుతం అతడి భార్య తమ్ముడు ఆయనను చూసుకుంటున్నారు. గ్రామస్తుల మీద రాళ్లు రువ్వడం, వాహనాల కిటికీల అద్దాలు పగులగొట్టడం లాంటి పనులు చేస్తూ ఇతరులను రాజారామ్ ఇబ్బందులకు గురి చేస్తున్నాడు.
Madhya Pradesh: A mentally challenged man roams around Badhraji village, 40 km from Jabalpur city. His hands and feet are roped together. Nobody knows who has tied up his legs and hands and for how long he has been roaming around the village. pic.twitter.com/cKlYMvO3dV
— Free Press Journal (@fpjindia) July 29, 2021