‘హిమాచల్ విధ్వంసానికి జీవహింసే కారణం’.. IIT మండీ డైరెక్టర్​ వివాదాస్పద కామెంట్స్

-

ఐఐటీ మండీ డైరెక్టర్‌ లక్ష్మీధర్ బెహరా వివాదాస్పద వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమవుతున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటానికి జీవహింసే కారణమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. భారీ వర్షాల వల్ల పోటెత్తిన వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనలతో హిమాచల్‌ప్రదేశ్‌ ఇటీవల అతలాకుతలమైన విషయం తెలిసిందే.

ఈ విపత్తులకు జీవహింసతో ముడిపెడుతూ స్థానిక ఐఐటీ మండీ డైరెక్టర్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ప్రజలు మాంసం తింటారని.. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటానికి జంతువులపై క్రూరత్వమే కారణమంటూ చెప్పడం వివాదాస్పదమైంది. అంతటితో ఆగకుండా మాంసాహారం తినబోమని విద్యార్థులతో మండీ డైరెక్టర్‌ ప్రతిజ్ఞ చేయించినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఆయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news