2022లో అనేక రంగాల్లో భారత్ అద్భుతంగా రాణించింది – ప్రధాని మోదీ

-

2022లో భారత్ అనేక రంగాలలో అద్భుతంగా రాణించిందని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. నేడు మన్ కి బాత్ లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారత్ విజయాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయని తెలిపారు. అంతరిక్షం, రక్షణ రంగం, డ్రోన్ రంగాలలో భారత్ సత్తా చాటిందని.. తొలి ఎయిర్ క్రాఫ్ట్ ఐఎన్ఎస్ విక్రాంత్ ను జాతికి అంకితం చేశామని గుర్తు చేశారు.

ప్రపంచవ్యాప్తంగా ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భరత్ ఎదిగిందన్నారు ప్రధాని మోదీ. 220 కోట్ల కరోనా టీకాల ఉత్పత్తి మైలురాయిని దాటామని చెప్పారు. అలాగే మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఆయన సేవలను కొనియాడారు. దేశానికి వాజ్పేయి సేవలు మరువలేనివని, అద్భుత నాయకత్వం అందించారని అన్నారు. మౌలిక సౌకర్యాల కల్పన, విద్యా, విదేశీ విధానంలో తనదైన ముద్రవేశారని తెలిపారు. భారత్ ను ఉన్నత శిఖరాలకు చేర్చడంలో వాజ్పేయి కృషి ఎంతో ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news