రూ.3 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు: నిర్మలా సీతారామన్‌

-

2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ఇవాళ ప్రవేశపెట్టారు. వరుసగా 7సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనతను నిర్మల సాధించారు. ఈ బడ్జెట్లో కొత్తపన్ను విధానంలో పన్ను శ్లాబ్‌లకు స్వల్ప మార్పులు చేశారు. దీని ప్రకారం రూ.3 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు.

అయితే రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు 5 శాతం, రూ.7 లక్షల నుంచి 10 లక్షల వరకు 10 శాతం, రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు 15 శాతం, రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 20 శాతం, రూ.15 లక్షలకంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారికి 30 శాతం పన్ను వర్తిస్తుందని బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ చెప్పారు. స్టాండర్డ్‌ డిడక్షన్ రూ.50వేల నుంచి రూ.75 వేలకు పెంచినట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు.

 

మరోవైపు అంకురాలు, ఆవిష్కరణల ప్రోత్సాహానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని తరగతుల పెట్టుబడిదారులపై ఏంజెల్‌ ట్యాక్స్‌ రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. వృత్తి నిపుణులు విదేశాల్లో కలిగివున్న చరాస్తులపై సమాచారం ఇచ్చి తీరాలని స్పష్టం చేసింది. లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. కొత్త పన్ను విధానం ఎంపిక చేసుకున్నవారికి రూ.3 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదుని తెలిపారు. రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు 5 శాతం పన్ను ఉంటుందని.. ఆదాయ పన్ను పాత విధానంలో ఎలాంటి మార్పులు లేవని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news