మణిపూర్ లో జాతుల మధ్య చోటుచేసుకున్న హింస అంశం ఉభయ సభలలో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఈ అల్లర్లపై ప్రధాని మోదీ పార్లమెంటులో ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి ఈ అంశం కారణంగా ఉభయసభలలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం నుండి సరైన స్పందన రాకపోవడంతో నేడు విపక్ష పార్టీలతో ఏర్పడిన ఇండియా కూటమి కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వంపై పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుంది. అయితే ప్రతిపక్షాల డిమాండ్లను కేంద్రం పట్టించుకోవడంలేదని.. ఈ నేపథ్యంలోనే బిజెపి ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కూటమి డిసైడ్ అయిందని సమాచారం. మరోవైపు విపక్షాల ఆందోళన నేపథ్యంలో లోక్సభ మధ్యాహ్నం రెండు గంటల వరకు, రాజ్యసభ 12 గంటల వరకు వాయిదా పడ్డాయి.