నేడు లోక్‌సభలో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం!

-

విపక్షాల కూటమి ‘ఇండియా’లో కొన్ని పార్టీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. లోక్‌ సభలో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మణిపుర్‌ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో ప్రకటన చేయాలని విపక్ష కూటమి డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనికి అధికార బీజేపీ విముఖత చూపడంతో చేసేదేం లేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మంగళవారం ఉదయం సమావేశమైన విపక్షాలు ఈ విషయమై చర్చించాయి. మణిపుర్​పై పార్లమెంటులో చర్చ జరిగేందుకు గల పలు మార్గాలను నేతలు పరిశీలించారని.. అవిశ్వాసం అనేది అత్యుత్తమ మార్గమని అనుకున్నారని కూటమి వర్గాలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ఇవాళ లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నాయని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరీ తెలిపారు. ఈ మేరకు డ్రాఫ్ట్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇది ఏ మేరకు నిలుస్తుందన్నది ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠగా మారింది. ఈరోజు ఉదయం 10 గంటల కంటే ముందే అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వాలనేది విపక్ష కూటమి ఆలోచనగా ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news