విజయ్‌ మాల్యా వస్తే మాకు అప్పగించండి.. ఫ్రాన్స్‌కు భారత్‌ విజ్ఞప్తి

-

బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగవేసి విదేశాల్లో దాక్కొన్న బిలియనీర్‌ విజయ్‌ మాల్యాపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచుతోంది. ఐరోపాలో అతడి కదలికలను నియంత్రించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే ఈ నెల మొదట్లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన భారత్‌-ఫ్రాన్స్‌ జాయింట్‌ వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశంలో ఈ అంశంపై చర్చించినట్లు సమాచారం.

ఈ సమావేశంలో ఫ్రాన్స్‌ కొన్ని ముందస్తు షరతులతో అతడిని అప్పగించే అంశాన్ని ప్రతిపాదించినట్లు తెలిసింది. అయితే భారత్‌ మాత్రం బేషరతుగా మాల్యా అప్పగింత జరగాలని కోరినట్లు ఓ ఇంగ్లీష్ మీడియా పేర్కొంది. 15వ తేదీన జరిగిన ఈ భేటీలో వీరు మనీలాండరింగ్‌, ఉగ్ర ఫండింగ్‌ కేసులకు సంబంధించి పరస్పర సహకారంపై చర్చించారు. ప్రస్తుతం మాల్యా యూకేలో నివాసం ఉంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడు ఆస్తులు కొనుగోలు చేసిన దేశాలకు వెళ్లనీయకుండా చేయాలని భారత్‌ నిర్ణయించింది. దీనిలో భాగంగా నేరస్థుల అప్పగింత ఒప్పందాలున్న దేశాలతో ఈ అంశంపై చర్చలు జరుపుతోంది. ఫ్రాన్స్‌తో భారత్‌కు ఇటువంటి ఒప్పందం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version