వివాదం వేళ భారత్‌-మాల్దీవుల విదేశాంగ మంత్రుల భేటీ

-

ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్‌ పర్యటన తర్వాత చేసిన ట్వీట్పై మాల్దీవుల మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తలకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఇరు దేశాల విదేశాంగమంత్రుల భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ వీరి భేటీ జరగడం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.

ఉగాండా రాజధాని కంపాలాలో అలీనోద్యమ(NAM) సదస్సు సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్ మాల్దీవుల మంత్రి మూసా జమీర్‌తో భేటీ అయ్యారు. అయితే ఈ భేటీలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపామని వాటి వివరాలను తమ ఎక్స్‌ ఖాతాల్లో విదేశాంగ మంత్రులు పోస్టు చేశారు. ఇరు మధ్య ఇరుదేశాల సంబంధాలపై లోతుగా చర్చ జరిగిందని.. భారత సైనికుల ఉపసంహరణపై జరుగుతోన్న ఉన్నతస్థాయి సమావేశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నామని జైశంకర్ తెలిపారు. మాల్దీవుల్లో అభివృద్ధి ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి ఉన్న మార్గాలపై చర్చించినట్లు వెల్లడించారు. ఇరు దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి కట్టుబడి ఉన్నట్లు మాల్దీవుల మంత్రి స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news