ఆ జిల్లాలో గెలిచిన వాళ్లదే ఏపీలో అధికారం

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా ప్రత్యేకత కలిగిన జిల్లా పశ్చిమ గోదావరి.మొత్తం 16 ఎమ్మెల్యే స్థానాలు ఉన్న ఈ జిల్లాలో మెజార్టీ సీట్లను గెలిస్టే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలొకి వస్తుంది.దీనిని రాజకీయ పార్టీల నేతలు నమ్ముతారు.అందుకే ఈస్ట్ వెస్ట్ పై ఎక్కువగా దృష్టి పెడతారు.2019 ఎన్నికల్లో ysrcp కి ఈ జిల్లా నుంచి 13 మంది విజయం సాధించారు. ఫలితంగా ఆ పార్టీ అధికారo చేపట్టింది.మళ్లీ ఏపీలో అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో ఉన్న వైసీపీ ఈ జిల్లాపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈసారి 16 సీట్లను గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని యోచిస్తోంది. ఆ దిశగా సీఎం జగన్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో గత ఐదు దఫాలుగా ఎన్నికల సరళిని చూస్తే.. ఇక్కడ మెజార్టీ సీట్లు సాధించుకున్న పార్టీనే అధికారంలోకి వస్తున్న సంస్కృతి కనిపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా లాగే ఈ జిల్లాలో మెజార్టీ సీట్లు దక్కించుకునే పార్టీయే రాష్ట్రంలో అధికారం చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఒకటీ రెండూ సార్లు కాదు దాదాపు ఐదు దఫాలుగా అదే జరుగుతూ వస్తోంది. గత ఐదు దఫాలుగా ఎన్నికల సరళిని చూస్తే.. పశ్చిమాన గెలుపు కీలక మలుపు అన్నట్టుగానే ఉంది.అందుకే అన్ని రాజకీయ పార్టీలు ఈ జిల్లాపై అధికంగా దృష్టి సారిస్తారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1999 ఎన్నికల నుంచి గత ఎన్నికల వరకు ఓసారి పరిశీలిస్తే 1999లో ఏపీలో అధికారం చేపట్టిన టీడీపీకి 180 సీట్లు వచ్చాయి.పశ్చిమ గోదావరి జిల్లాలో 16కి గాను టీడీపీ 14 స్థానాల్లో గెలుపొందింది.2004లో విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీకి 188 సీట్లు రాగా పశ్చిమ గోదావరి జిల్లాలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా గెలిచారు. అప్పుడు ముఖ్యమంత్రిగా వై యెస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యారు.2009లో మళ్లీ విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీకి 156 సీట్లు వచ్చాయి.పశ్చిమ గోదావరి జిల్లాలో 9 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. సీట్లు తగ్గినప్పటికీ వై ఎస్ రాజశేఖరరెడ్డి రెండో సారి సీఎం అయ్యారు.

రాష్ట్ర విభజన తరువాత 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది.175 స్థానాలకు గాను ఆ పార్టీకి 102 స్థానాలు వచ్చాయి.అప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆ పార్టీకి పశ్చిమ గోదావరి జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.2019లో జరిగిన ఎన్నికల్లో 175 స్థానాలకు గాను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ 151 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుని ప్రభంజనం సృష్టించింది.
పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ ఇక్కడ 13 స్థానాల్లో గెలిచింది.ఈసారి పశ్చిమాన అన్ని సీట్లను గెలవడమే టార్గెట్ గా పెట్టుకుంది వైసీపీ.

Read more RELATED
Recommended to you

Latest news