2060 నాటికి భారత జనాభా 170 కోట్లు

-

గతేడాది చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించిన భారత్‌, ఈ శతాబ్దం మొత్తం అదే కంటిన్యూ చేయనున్నట్లు ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. 2024లో భారత్‌ జనాభా 145 కోట్లని అంచనా వేసిన ఐక్యరాజ్య సమితి.. 2054 నాటికి అది 169 కోట్లకు చేరుతుందని వెల్లడించింది. ఆ తర్వాత క్రమంగా 150 కోట్లకు తగ్గుతుందని తెలిపింది. భారత జనాభా 2060 నాటికి 170 కోట్ల వద్ద గరిష్ఠానికి చేరుతుందని ఐక్యరాజ్య సమితి వ్యాఖ్యానించింది. తర్వాత 12శాతం తగ్గుదల రేటుతో క్రమంగా దిగొస్తుందని తెలిపింది.

‘మరోవైపు ప్రస్తుతం చైనా జనాభా 141 కోట్లని, 2054 నాటికి 121 కోట్లకు తగ్గుతుందని ఐరాస నివేదిక పేర్కొంది. 2100 నాటికి అది 63.3 కోట్లకు పడిపోతుంది. 2100 నాటికి చైనా జనాభా కంటే భారత జనాభా రెండున్నర రెట్లు ఎక్కువ ఉంటుంది. 2024-54 మధ్య చైనా జనాభాలో భారీ ఎత్తున తగ్గుదల నమోదవుతుంది.’ అని ఐరాస నివేదిక అంచనా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news