16న హైదరాబాద్‌లో జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్‌

-

ఈనెల 16న సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో నిర్వహించే రాష్ట్ర స్థాయి కాన్ఫరెన్స్‌లో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. దీనికి సంబంధించిన అజెండాను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) శాంతికుమారి ఖరారు చేశారు.

మొత్తం 9 అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసింది వాటికి సంబంధించిన వివరాలతో హాజరు కావాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లను సీఎస్‌ శాంతి కుమారి ఆదేశించారు. ఇటీవలే అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కొందరు కలెక్టర్లు కార్యాలయాలకే పరిమితమవుతున్నారని.. క్షేత్రస్థాయిలో పాలనా వ్యవస్థ మరింత పటిష్ఠం కావాలని దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలోనే వారానికో జిల్లాలో పర్యటించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించనున్నట్టు తెలిపారు. ప్రజాపాలన, ధరణి, వ్యవసాయం, ఆరోగ్యం- సీజనల్‌ వ్యాధులు, వన మహోత్సవం, మహిళా శక్తి, విద్య, శాంతి భద్రతలు, డ్రగ్స్‌ నిర్మూలన క్యాంపెయిన్‌ వంటి పలు అంశాలపై కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news