రెడ్ అలర్ట్.. హెపటైటిస్‌ కేసుల్లో రెండో స్థానంలో భారత్‌

-

హెపటైటిస్‌ – బి, సి కేసులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌ హెపటైటిస్‌ వల్ల చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని పేర్కొంది. మరణాల విషయంలో ఇది క్షయ వ్యాధి స్థాయిలో ఉందని తెలిపింది. హెపటైటిస్‌ – బి, సి కేసుల్లో భారత్‌.. చైనా తర్వాత రెండో స్థానంలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక వెల్లడించింది. 2022లో భారత్‌లో ఈ రుగ్మత బాధితులు 3.5 కోట్ల మంది ఉన్నారని తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా 2022లో 25.4 కోట్ల మంది హెపటైటిస్‌-బి, 5 కోట్ల మంది హెపటైటిస్‌-సి బాధితులు ఉండగా.. చైనాలో ఈ రెండు రకాలు కలిసి 8.3 కోట్ల కేసులు ఉన్నట్లు డబ్ల్యూహెచ్ఓ నివేదిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా నమోదైన హెపటైటిస్‌ కేసుల్లో ఇవి 27.5 శాతంగా తెలిపింది. భారత్‌లో 2.98 కోట్ల హెపటైటిస్‌- బి కేసులు, 55 లక్షల హెపటైటిస్‌- సి ఇన్‌ఫెక్షన్లు నమోదయ్యాయని, ప్రపంచవ్యాప్తంగా వెలుగుచూసిన కేసుల్లో ఇవి 11.6 శాతం అని వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news