ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంటులో టీమిండియా జట్టు తన జైత్రయాత్ర కొనసాగిస్తోంది. లీగ్ దశలో టీమిండియా అన్ని మ్యాచ్లలో విజయం సాధించి సంచలనం సృష్టించింది. నిన్న జరిగిన నెదర్లాండ్ జట్టుపై కూడా టీమిండియా గ్రాండ్ విక్టరీ అందుకుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఏకంగా160 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి ఏకంగా 410 పరుగులు చేసింది.
ఇందులో రోహిత్ శర్మ, గిల్ మరియు విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలు చేసుకున్నారు. కేఎల్ రాహుల్ మరియు శ్రేయస్ అయ్యర్ ఇద్దరు సెంచరీలు చేసుకున్నారు. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన నెదర్లాండ్ జట్టు 250 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్లో బుమ్ర, మహమ్మద్ సిరాజ్, జడేజా మరియు కుల్దీప్ యాదవ్ తలో రెండు వికెట్లు తీశారు. అటు విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ చెరో వికెట్ తీశారు. దీంతో ఓటమి లేకుండా తొమ్మిది మ్యాచ్లు ఆడి విజయం సాధించింది. ఎల్లుండి సెమీఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టుతో… టీమిండియా తలపడనుంది.