World Cup 2023 : ఇవాళ టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య బిగ్‌ ఫైట్‌

-

World Cup 2023 : ఇవాళ టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య బిగ్‌ ఫైట్‌ జరుగనుంది. ప్రత్యర్ధులతో సంబంధం లేకుండా ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతూ టాప్ గేర్ లో దూసుకుపోతున్న భారత జట్టు ఆదివారం మరో కీలక మ్యాచ్ ఆడనుంది. ఆస్ట్రేలియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ ఇలా ఎదురైన ప్రతి జట్టును మట్టి కరిపించిన రోహిత్ సేన….. సఫారీలతో సమరానికి సై అంటున్నది.

India vs South Africa, 37th Match

బలబలాల దృష్ట్యా ఇరుజట్లు సమ ఉజ్జీలుగా కనిపిస్తున్నా….. సఫారీల బౌలింగ్ దాడి కన్నా మన పేస్ బలంగా ఉందనేది వాస్తవం. టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య బిగ్‌ ఫైట్‌ ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం అవుతుంది.

జట్ల అంచనా

South Africa XI: టెంబా బావుమా (c), క్వింటన్ డి కాక్ (WK), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, లుంగి ఎన్గిడి, తబ్రైజ్ షమ్సీ

India XI: శుభమన్ గిల్, రోహిత్ శర్మ (c), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్ (wk), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

Read more RELATED
Recommended to you

Latest news