టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. వెస్టిండీస్ జట్టుపై సిరీస్ కోల్పోయిన టీమిండియా ఐర్లాండ్ లో మాత్రం శుభారంభం చేసింది. ఐర్లాండ్ జట్టుపై ఏకంగా రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది టీమిండియా. మ్యాచ్ కు వర్షం అడ్డు తగలడంతో టీమిండియా డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. అయితే టార్గెట్ చేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా కు ఆది నుంచి వర్షం అడ్డు తగిలింది. అయితే వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి 6.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసింది టీమిండియా. దీంతో మ్యాచ్ పైకి కలగజేసుకున్న ఎంపైర్లు…. డక్వర్తు లూయిస్ పద్ధతి ప్రకారం టీమ్ ఇండియాకు రెండు పరుగుల విజయాన్ని ఇచ్చారు. దీంతో బుమ్రా వచ్చాక టీమిండియా కు మొదటి విజయ మందింది అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.