సైబర్ వార్​కు ఇండియా సై.. శత్రువులకు వణుకు పుట్టేలా CCOSW విభాగం

-

భారత్​పై సైబర్ వార్​ను అడుగడుగునా అడ్డుకునేందుకు ఇండియన్ ఆర్మీ ఓ సరికొత్త విభాగాన్ని ఏర్పాటు చేయనుంది. భవిష్యత్‌ పరిణామాల్ని ఊహించిన భారత సైన్యం.. రక్షణ రంగ బలోపేతం కోసం కమాండ్ సైబర్ ఆప్స్ అండ్‌ సపోర్ట్ వింగ్స్‌ CCOSWను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ వింగ్‌ ఏర్పాటుతో భారత సైన్యం శత్రు దుర్బేధ్యంగా మారనుంది.

ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే నేతృత్వంలో జరిగిన సైనిక కమాండర్ల సమావేశంలో CCOSWను ఏర్పాటు చేయాలని సైన్యం నిర్ణయం తీసుకుంది. అటు డ్రాగన్‌, పాక్‌లు సైబర్ యుద్ధ సామర్థ్యాన్ని విస్తరిస్తూ భారీ పెట్టుబడులు పెడుతున్న తరుణంలో ఆధునిక సమాచార వ్యవస్థలతో నెట్‌వర్క్‌లను రక్షించాల్సిన అవసరాన్ని సైన్యం సమీక్షించింది. గ్రేజోన్ వార్‌ఫేర్‌తో పాటు సంప్రదాయ యుద్ధంలో సైబర్‌స్పేస్‌ కీలకంగా మారిందని సైన్యం ఎప్పుడో గుర్తించింది.

శత్రువుల నుంచి వర్చువల్ హనీట్రాపింగ్‌, హ్యాకింగ్‌ వంటి సైబర్ దాడుల్ని ఎదుర్కోవడానికి అనేక చర్యలు తీసుకున్న సైన్యం.. ఈ భద్రతా చర్యల విస్తరణకు CCOSWను నెలకొల్పనుంది. శత్రువులను ఎదుర్కోవడమే కాకుండా సైనిక సైబర్ భద్రతా విధులను నిర్వహించేందుకు CCOSW వ్యవస్థ అత్యంత కీలకం కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news