ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ అండ్ స్టడీస్ కోసం క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ను విడుదల చేసింది. అందులో భారత్కు చెందిన మూడు యూనివర్సిటీలకు టాప్ 50లో చోటు దక్కింది. టాప్ -25లో.. అహ్మదాబాద్ (ఐఐఏం), టాప్ 50లో .. బెంగళూరు(ఐఐఏం), కలకత్తా(ఐఐఏం)కు చోటు దక్కాయి. లండన్‌కు చెందిన ఉన్నత విద్యా విశ్లేషణల సంస్థ క్వాక్ వారెల్లి సైమండ్స్ (QS) ప్రకటించిన ర్యాంకింగ్‌ల్లో భారత్కు చెందిన జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, డెలవప్ మెంట్ స్టడీస్లో ప్రపంచవ్యాప్తంగా 20వ స్థానం దక్కించుకుంది. ఈ విభాగంలో భారత్లో అత్యున్నత ర్యాంకు సాధించిన యూనివర్సిటీ జేఎన్యూనే. మరోవైపు చెన్నైలోని సవీత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్ డెంటిస్ట్రీ స్టడీస్‌లో ప్రపంచ వ్యాప్తంగా 24వ స్థానంలో నిలిచింది.
QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో 69 భారతీయ విశ్వవిద్యాలయాలు చోటు దక్కించుకున్నాయి. భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో విద్యా రంగం ఒకటని క్యూఎస్ సీఈఓ జెస్సికా టర్నర్ అన్నారు. ఈ సంవత్సరం యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో సబ్జెక్టుల వారీగా భారతదేశం గణనీయమై పురోగతిని ప్రదర్శించిందని, ప్రతి పేపర్ సూచికలో 20 శాతం మెరుగుదలను సాధించిందని తెలిపారు.