తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ఠ్. నేడు, రేపు తెలంగాణలో తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ తరుణంలోనే ఉత్తర తెలంగాణ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.
గత రెండు రోజులుగా ఎండ తీవ్రత తగ్గిన విషయం తెలిసిందే. సూర్యుడు అస్తమించగానే వర్షలుంటాయని… గాలులతో కూడిన వర్షాలు, వడగండ్ల వనాలు ఉండే ఛాన్స్ ఉన్నట్లు హెచ్చరించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రైతులు దాన్యాన్ని భద్రపరచుకోవాలి.
గత ఏడాది ఎల్ యినో ఎఫెక్ట్ తో వర్షాలు తక్కువ… అదే ఎఫెక్ట్ తో ఈ ఏడాది ఎండలు ఎక్కువ అని వెల్లడించింది వాతావరణ శాఖ. ఈ నెల ఏప్రిల్ 15 వరకు దక్షిణ జిల్లాల్లో 40 డిగ్రీలకు కిందనే ఎండలు కొడుతాయట. మే నెలలో సైక్లోన్ ఉండే అవకాశాలు ఉన్నాయని.. లానీనో కండిషన్ తో ఈ ఏడాది వర్షాలు సాధారణంగానే ఉంటాయని తెలిపింది వాతావరణ శాఖ.