సీఎం వైఎస్ జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు బ్రేక్ పడింది. నేడు రంజాన్ కారణంగా సీఎం వైఎస్ జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు బ్రేక్ వేశారు. ఇక నేడు ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో భేటీకానున్నారు వైఎస్ జగన్. మళ్లీ రేపటి నుంచే సీఎం వైఎస్ జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర పునః ప్రారంభం కానుంది.
ఇక నిన్న ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. మనం పెట్టిన వాలంటీర్లకి చంద్రబాబు 10 వేలు ఇస్తాడట. ఇలాగైనా జగన్ పాలన బాగుందని చంద్రబాబు ఒప్పుకున్నాడు.. సంతోషం అన్నారు. మొన్నటిదాకా ఇదే చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు మన వాలంటీర్ వ్యవస్థ గురించి ఏమన్నారో చూశాం. అయ్యా చంద్రబాబు.. అక్కడ జన్మభూమి కమిటీలు, వాలంటీర్లది టాపిక్ కాదు.. ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నారన్నది టాపిక్ అంటూ చురకలు అంటించారు.