నేటితో ముగియనున్న దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఈడీ కస్టడీ

-

మరికొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం ఏడు విడతల్లో జరగనున్న ఈ ఎన్నికలకు సంబంధించి తొలి విడత పోలింగ్ ఏప్రిల్ 19వ తేదీన నిర్వహించనున్నారు. అయితే, పోలింగ్ రోజు ఓటు వేయడానికి వెళ్తూ ఓటర్ ఐడీ కార్డు కనిపించకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఓటెలా వేయడం, అంత దూరం నుంచి వచ్చింది వృథాయేనా అంటూ బాధపడొద్దు. ఓటరు ఐడీ లేకున్నా మీరు హ్యాపీగా ఓటు వేయొచ్చు. అదెలాగంటారా?

ఓటరు జాబితాలో పేరున్న వారంతా ఓటరు ఐడీ అందుబాటులో లేకున్నా, ఓటు వేయవచ్చని ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఓటు వేయడానికి ముందు పోలింగ్ కేంద్రంలో ఓటరు గుర్తింపు కార్డు లేదంటే ఈ కింద తెలిపిన 12 ప్రత్యామ్నాయ ఫొటో గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించి ఓటు వేయవచ్చు. అవేంటంటే?

1. ఆధార్ కార్డు

2. డ్రైవింగ్ లైసెన్స్

3. పాన్ కార్డు

4. ఉపాధి హామీ కార్డు

5. పాస్ పోర్టు

6. బ్యాంక్ లేదా పోస్టాఫీస్ జారీ చేసిన ఫొటోతో కూడిన పాస్ బుక్

7. కార్మిక శాఖ మంజూరు చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు

8. ఎన్పీఆర్ స్మార్ట్ కార్డ్

9. ఫొటోతో కూడిన పెన్షన్ డాక్యుమెంట్

10. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులకు జారీ చేసిన సర్వీస్ ఐడీ కార్డులు

11. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అధికార గుర్తింపు కార్డులు

12. దివ్యాంగులకు జారీచేసిన ఐడీ కార్డుల్లో ఏదొకటి చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు

Read more RELATED
Recommended to you

Latest news