బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనేత్‌కు ఆ పార్టీ హైకమాండ్ షాకిచ్చింది. తాజాగా విడుదల చేసిన లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో ఆమెకు టికెట్ దక్కలేదు. 2019లో ఉత్తర్ ప్రదేశ్‌లోని మహరాజ్‌గంజ్ నుంచి సుప్రియా శ్రీనేత్ పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా ఆ స్థానం నుంచి పార్టీ తరఫున వీరేంద్ర చౌదరి పోటీ చేయనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఎన్నికల వేళ వివాదానికి తెరతీసిన నేపథ్యంలో ఆమెను పక్కన పెట్టినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
హిమాచ్‌ప్రదేశ్‌లోని మండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్న కంగనా రనౌత్‌కు సంబంధించి సుప్రియా ఓ అభ్యంతరకర పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టు నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైన విషయం కావడంతో, కంగన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పోస్టు చేసింది తాను కాదని.. తన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల యాక్సెస్ చాలా మంది వద్ద ఉందని సుప్రియ తెలిపారు. మరోవైపు సుప్రియకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. శుక్రవారం సాయంత్రంలోగా వీటిపై తమకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది.