ఇలా చేస్తే.. చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి..!

-

దంతాల ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది చాలా మంది పంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇటువంటి సమస్యలు కలగకూడదంటే వీటిని కచ్చితంగా పాటించాలి చిగుళ్ల ఆరోగ్యాన్ని కాపాడడానికి ఈ చిట్కాలు మీకు బాగా ఉపయోగపడతాయి. ఇలా కనుక మీరు చేసినట్లయితే కచ్చితంగా చిగుళ్ళు బాగుంటాయి నోటిలో చిగుళ్ళు కూడా ఒక భాగం. కనుక నోరు బాగుండాలంటే చిగుళ్ళని కూడా కాపాడుకోండి.

చిగుళ్ల ఆరోగ్యముని ఎలా కాపాడుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. చిగుళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు బ్రష్ చేసుకోవడం చాలా ముఖ్యం. రోజుకి రెండుసార్లు బ్రష్ చేసుకోండి అలానే బ్రష్ చేసుకున్న తర్వాత పళ్ళ మధ్యలో శుభ్రం చేసుకోండి దాని వలన నోరు ఆరోగ్యంగా ఉంటుంది చెడు బ్యాక్టీరియా అంతా కూడా పోతుంది. చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పేస్ట్ ని ఎంపిక చేసుకోండి. ప్లేస్ట్ లో ఫ్లోరైడ్ ఉండేటట్టు చూసుకోండి అప్పుడు నోరు శుభ్రంగా ఉంటుంది.

బ్రష్ చేసుకున్న తర్వాత మౌత్ వాష్ కూడా ముఖ్యము. దీనివలన పళ్ళ మధ్యలో నోట్లో ఉన్న క్రిములు పోతాయి. చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. రోజు తగినంత నీళ్లు తాగడం వలన లాలాజలం బాగా ఉత్పత్తి అవుతుంది. నోటిలో చెడు బ్యాక్టీరియా పెరగకుండా కాపాడుతుంది. అందువల్ల రోజుకి కనీసం 8 గ్లాసుల వరకు నీళ్లు తాగండి. ప్రతి ఏడాది డెంటిస్ట్ దగ్గరికి వెళ్లడం కూడా అవసరం. ఇలా పంటి ఆరోగ్యాన్ని ఈ చిట్కాలతో కాపాడుకోవచ్చు చిగుళ్ళు డామేజ్ అవ్వడానికి సిగరెట్ కూడా ఒక కారణం అని చెప్పొచ్చు కాబట్టి చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే స్మోకింగ్ కి దూరంగా ఉండండి.

Read more RELATED
Recommended to you

Latest news