ISRO : 10 కీలక ప్రయోగాలు చేపట్టనున్న ఇస్రో

-

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇప్పటికే ఎన్నో విజయవంతమైన ప్రయోగాలు చేపట్టిన ఈ సంస్థ ఇటీవల చంద్రయాన్-3తో చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపిన తొలి దేశంగా ప్రపంచంలో చరిత్ర సృష్టించింది. ఇక ఆ తర్వాత సూర్యుడిపై ప్రయోగానికి ఆదిత్య ఎల్​1ను పంపింది. ఇలా వరుస విజయాలతో ప్రపంచ వ్యాప్తంగా మన్ననలు అందుకుంటున్న ఇస్రో వచ్చే ఏడాదికి మాస్టర్ ప్లాన్ రెడీ చేసుకుంది.

వచ్చే ఏడాదిలో కీలక ప్రయోగాలకు చేపట్టేందుకు ఇస్రో సంసిద్ధమవుతోంది. ఈ క్రమంలో 2024లో ఇస్రో ముఖ్యమైన 10 ప్రయోగాలు చేపట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు వెల్లడించింది. 6 పీఎస్‌ఎల్వీ ప్రయోగాలతోపాటు 3 జీఎస్‌ఎల్వీ, ఒక లాంచ్‌ వెహికల్‌ మార్క్‌-3 మిషన్‌ ఉన్నట్లు తెలిపింది. ఇస్రో అభివృద్ధి చేసిన సరికొత్త ప్రయోగ వాహక నౌక ఎస్‌ఎస్‌ఎల్వీ (స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌) ద్వారా ప్రయోగాత్మకంగా ఓ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించనున్నట్లు కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ సభకు తెలిపారు. రోదసిలోకి సొంతంగా వ్యోమగాములను పంపేందుకు ‘గగన్‌యాన్‌’ పేరిట భారత్‌ ప్రతిష్ఠాత్మక మిషన్‌ను చేపడుతున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news