ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరికొన్ని నెలల్లో ఎన్నికలు రాబోతుండటంతో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఏపీ ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రతిపాదిస్తూనే తొలి మూడు నెలల కాలానికి ప్రభుత్వం అసెంబ్లీ నుంచి ఓట్ ఆన్ అకౌంట్ కు ఆమోదం పొందుతుంది.
జనవరి నెలాఖరు నాటికి పూర్తి బడ్జెట్ రూపొందించాలని అధికారులకు ఆదేశాలు అందాయి. ఫిబ్రవరి తొలి వారంలో అసెంబ్లీకి సమర్పించే ఛాన్స్ ఉంది. కాగా, మిచౌంగ్ తుఫాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన ఏపీకి కేంద్రం ఆర్థిక సాయం ప్రకటించింది. రూ. 498.60 కోట్ల ఎన్డిఆర్ఎఫ్ నిధులు విడుదల చేయాలని ప్రధాని మోదీ ఆదేశించినట్లు హోం శాఖ మంత్రి తెలిపారు. తుఫాను ప్రభావం ఏపీ, తమిళనాడు ఎక్కువగా ఉందన్నారు. TNకు రూ. 450 కోట్లు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల క్షేమం కోసం కేంద్రం అండగా నిలుస్తుందని భరోసానిచ్చారు.