పని చేతకానివాళ్లే మాటలతో సరిపెడతారు : జైరాం ఠాకూర్

-

హిమాచల్​ప్రదేశ్​లో ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్​లు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఒక్క ఛాన్స్ ఇవ్వండంటూ కాంగ్రెస్ హామీల వర్షాలు కురిపిస్తుంటే.. మళ్లీ మాదే ఛాన్స్ అంటూ బీజేపీ ప్రచారం చేస్తోంది. హిమాచల్​లో వచ్చే 25 ఏళ్ల పాటు బీజేపీనే అధికారంలో ఉంటుందని ఆ రాష్ట్ర సీఎం జైరాం ఠాకూర్ ధీమా వ్యక్తం చేశారు. వరుసగా రెండోసారి ఏ పార్టీకీ అధికారం ఇవ్వని హిమాచల్‌ ప్రజలు ఈసారి చరిత్రను తిరగరాస్తారని అన్నారు. బంజార్ నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో జైరాం ఠాకూర్‌ మాట్లాడారు.

‘‘కాంగ్రెస్‌ నాయకులు ఈసారి తమవంతు అనుకుంటున్నారు. కానీ, ఉత్తరాఖండ్‌తోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ వారు అదే మాట చెప్పారు. అక్కడ కాంగ్రెస్‌ పరిస్థితి ఏమైంది. కొన్ని స్థానాల్లో డిపాజిట్లు కూడా కోల్పోయారు. అధికారంలోకి వస్తే మేం అది చేస్తాం, ఇది చేస్తామని కాంగ్రెస్‌ ప్రగల్భాలు పలుకుతోంది. పని చేతకానివాళ్లే మాటలతో సరిపెడతారు’’ అని సీఎం వ్యాఖ్యానించారు. హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ మునిగిపోతున్న నావ లాంటిదని జైరాం ఠాకూర్ విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version