రాష్ట్రంలోని హిందూ దేవాలయాలపై వరుసగా దాడులు కొనసాగుతున్నా అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతున్నారు. కొద్ది రోజుల కిందట శంషాబాద్‌లోని ఆంజనేయ స్వామి ఆలయంలో నవగ్రహలను ధ్వంసం చేసిన మరువక ముందే.. తాజాగా శనివారం రాత్రి శంషాబాద్ మండలం జూకల్‌లో మరో ఆలయంపై దాడి జరిగింది. 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు గ్రామంలోని చౌడమ్మ, పోచమ్మ ఆలయంపై దాడికి పాల్పడ్డారు.
అంతేకాకుండా, గర్భగుడిలోని అమ్మవారి విగ్రహానికి ఉన్న వస్త్రాలు, కళ్లను తొలగించారు.రాత్రివేళ కావడంతో గ్రామస్థులు గుర్తించలేకపోయారు.ఆలయంలో నుంచి నిందితులు వస్తున్న టైంలో ఒకరిని గ్రామస్థులు పట్టుకున్నారు. 9 మంది పరారయ్యారు.ఆలయంలోని అమ్మవారి విగ్రహ ధ్వంసాన్ని గమనించిన గ్రామస్థులు ఆగ్రహంతో రగిలిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.