పాక్ దాడుల నేపథ్యంలో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. పాక్ దాడుల్లో దాదాపు 10 మంది జవాన్లు 40కి పైగా సామాన్యులు మృతి చెందారు. పహల్గాం దాడిలో 26 మంది చనిపోయిన తరువాత పాకిస్తాన్ చేసిన దాడుల్లో పూంచ్ సెక్టార్లో 16 మంది సామాన్యులు చనిపోగా మరో 10 మంది జవాన్లు వీర మరణం పొందారు.

ఇక అటు పాకిస్తాన్ కు ప్రధాని మోడీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అణ్వాయుధాలను అడ్డు పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తే చూస్తూ ఊరుకోం.. చనిపోయిన ఉగ్రవాదులను చూసి పాక్ ఆర్మీ ఆఫీసర్లు కన్నీరు పెట్టుకున్నారని తెలిపారు. ప్రతిసారి యుద్ధంలో పాకిస్తాన్ దుమ్ముదులిపేశాం… న్యూ ఏజ్ వార్ ఫేర్‌లో కూడా మన శక్తిని చూపించామన్నారు. 21వ శతాబ్దం యుద్ధ రీతిలో మేకిన్ ఇండియా ఆయుధాలు వినియోగించాం.. ఇది యుద్ధాల యుగం కాదు.. అలాగే ఉగ్రవాదుల యుగం కూడా కాదు.. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు ప్రధాని మోడీ.
పాక్ దాడుల్లో దాదాపు 10 మంది జవాన్లు 40కి పైగా సామాన్యులు మృతి
పహల్గాం దాడిలో 26 మంది చనిపోయిన తరువాత పాకిస్తాన్ చేసిన దాడుల్లో పూంచ్ సెక్టార్లో 16 మంది సామాన్యులు చనిపోగా మరో 10 మంది జవాన్లు వీర మరణం పొందారు pic.twitter.com/zbQzGuyGg4
— Telugu Scribe (@TeluguScribe) May 13, 2025