సెప్టెంబరులో జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు’

-

జమ్మూకశ్మీర్‌లో సెప్టెంబరు నెలలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ప్రకటించిన కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి ..  ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు, అభివృద్ధిని కొనసాగించేందుకు బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జమ్మూకశ్మీర్లో కాషాయ సర్కార్ను గెలిపించాలని కోరారు. జమ్మూలో ‘ఏకాత్మ మహోత్సవ్‌’ ర్యాలీలో ప్రసంగిస్తూ.. మోదీ ప్రభుత్వానికి మరోసారి ఓటేయాలని విన్నవించారు.

జమ్మూకశ్మీర్‌లో బీజేపీ ఎన్నికల ఇంఛార్జ్‌గా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన సెప్టెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని, ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్‌కు రాజ్యాంగాన్ని పొడిగించడం ద్వారా పార్టీ తీసుకువచ్చిన మార్పులను చూసి ప్రజలు బీజేపీని భారీ మెజార్టీతో గెలిపిస్తారనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరోవైపు జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే 370 ఆర్టికల్‌ను కేంద్రం రద్దు చేసి నిన్నటితో ఐదేళ్లు పూర్తవ్వడంతో కేంద్రం భద్రతాబలగాలను హై అలర్ట్‌లో ఉంచింది. సైనిక సిబ్బందిని తరలించే కాన్వాయ్‌ల రాకపోకలను నిలిపివేశారు. అదనపు భద్రతా సిబ్బందిని కూడా ఆ ప్రాంతానికి తరలించారు.చొరబాట్లు, అనుమానాస్పద కదలికలను పర్యవేక్షించేందుకు సరిహద్దుల వద్ద సెక్యూరిటీ మరింత టైట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version