బీజేపీ జమ్మూకశ్మీర్‌ ఎన్నికల ఇన్‌ఛార్జిగా కిషన్‌ రెడ్డి

-

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పలు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు తాజాగా బీజేపీ ఇన్‌ఛార్జులను నియమించింది. ఆయా రాష్ట్రాల్లో పార్టీ తరఫున ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతల్ని పలువురు కేంద్రమంత్రులు, సీనియర్‌ నేతలకు అప్పగించింది. ఇందులోభాగంగా కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్‌కు బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జిగా కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డిని నియమించింది.

మరోవైపు మహారాష్ట్రకు కేంద్రమంత్రులు భూపేందర్‌ యాదవ్‌ (ఇన్‌ఛార్జి), అశ్వనీ వైష్ణవ్‌ (సహ ఇన్‌ఛార్జి)లను నియమించిన భాజపా అధిష్ఠానం.. హర్యానాకు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌(ఇన్‌ఛార్జి), త్రిపుర మాజీ సీఎం బిప్లవ్‌దేవ్‌ కుమార్‌(సహ ఇన్‌ఛార్జి), ఝార్ఖండ్‌కు కేంద్రమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌(ఇన్‌ఛార్జి), అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ(సహ ఇన్‌ఛార్జి)లను నియమిస్తూ సోమవారం మధ్యాహ్నం ఓ ప్రకటన విడుదల చేసింది. మహారాష్ట్ర, హరియాణా, ఝార్ఖండ్‌లలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, జమ్మూకశ్మీర్‌లో సెప్టెంబర్‌లోగా ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించని విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news