ఆ తప్పిదం వల్లే బంగాల్​ రైలు ప్రమాదం!

-

ఈ మధ్య తరచూ రైలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. సిగ్నల్ సమస్యలు, సిగ్నల్ జంపింగ్, ఒకే ట్రాక్​పై రెండు రైళ్లు రావడం ఇలా రకరకాలుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. పదుల సంఖ్యలో ప్రయాణికుల ప్రాణాలు తీస్తున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్​లో సోమవారం రోజున కాంచన్‌ జంఘా ఎక్స్​ప్రెస్​ను ఓ గూడ్స్ రైలు ఢీ కొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 15 మంది మరణించగా, 60మందికి పైగా గాయపడ్డారు.

అయితే ఈ ప్రమాదం సిగ్నల్ జంప్ కారణంగానే జరిగినట్లు రైల్వే బోర్డ్ అధికారులు తెలిపారు. రెడ్​ సిగ్నల్ వేసినా గూడ్స్​ రైలు పట్టించుకోకుండా వెళ్లడం వల్లే ఈ ఘటన జరిగిందని రైల్వే బోర్డ్ సీఈఓ జయ వర్మ సిన్హా వెల్లడించారు. ఈ ప్రమాదం సోమవారం ఉదయం 8:55 గంటలకు జరిగిందని.. కాంచన్​జంఘా ఎక్స్​ప్రెస్​ను వెనుక నుంచి ఓ గూడ్స్ రైలు వచ్చి ఢీ కొట్టిందని చెప్పారు. రెడ్​ సిగ్నల్ వేసినా గూడ్స్ ట్రైన్ లోకోఫైలట్​ పట్టించుకోకుండా ముందుకు వెళ్లిన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news