కాశ్మీర్ లో భద్రతా బలగాలకు కీలక విజయం లభించింది. నౌగామ్ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంలో భద్రతా బలగాలు వారున్న ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. దీంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం అయ్యారు. వీరంతా నిషేధిత లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదులుగా గుర్తించారు పోలీసులు. ఘటనస్థలంలో మందుగుండు సామాగ్రి, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రస్తుతం ఎన్ కౌంటర్ లో హతమైన ఈ ముగ్గురు ఉగ్రవాదులు కూడా ఇటీవల ఓ సర్పంచ్ ను కాల్చిచంపిన వారని పోలీసులు గుర్తించారు. మార్చి 9న జమ్మూకాశ్మీర్ లోని ఖాన్మోహ్ సర్పంచ్ సమీర్ భట్ ను కాల్చి చంపారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని లష్కర్ ఏతోయిబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెంట్ ఫ్రంట్ ప్రకటించింది. తాజాగా భద్రతా బలగాల కాల్పుల్లో ఈ ముగ్గురిని హతమార్చారు భద్రతా బలగాలు.