కశ్మీర్​లో ముష్కరుల వీరంగం.. ముగ్గురు సైనికులు వీరమరణం

-

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదులు మళ్లీ విరుచుకుపడ్డారు. కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాదులతో పోరాడుతూ ముగ్గురు జవాన్లు వీర మరణం పొందారు. ముష్కరులను మట్టుబెట్టేందుకు వెళ్లిన సైనికులు.. హలాన్‌ అటవీ ప్రాంతంలో అమరులయ్యారు. హలాన్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు శుక్రవారం అక్కడ తనిఖీలు చేపట్టాయి. ఈ నేపథ్యంలోనే భారీగా ఆయుధాలను కలిగి ఉన్న ఉగ్రవాదులు.. ఒక్కసారిగా సైనికులపైకి కాల్పులు జరిపడంతో ముగ్గురు జవాన్లకు బుల్లెట్ గాయాలయ్యాయి. వారిని తోటి సైనికులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ వారు వీరమరణం చెందారు. ప్రస్తుతం కుల్గామ్​ జిల్లాలో నక్కిన ఉగ్రవాదుల కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు సైన్యం ప్రకటించింది.

మరోవైపు.. శ్రీనగర్​లోని నాతిపోరాలో పోలీసులు చేపట్టిన విస్తృత తనిఖీల్లో నిషేధిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్​(టీఆర్ఎఫ్​)తో సంబంధం ఉన్న ముగ్గురు ఉగ్రవాదులు పట్టుబడ్డారు. వీరి దగ్గర నుంచి 3 హ్యాండ్ గ్రెనేడ్లు, 10 తుపాకీలు, 25 ఏకే-47 గన్​లు, పేలుడు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news