తెలంగాణలో VRAల సర్దుబాటుకు 14,954 పోస్టులు

-

వీఆర్‌ఏలను వివిధ శాఖల్లో సర్దుబాటు చేసేందుకు రాష్ట్ర సర్కార్ 14,954 పోస్టులను మంజూరు చేసింది. ఇందులో 3,717 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. 11,237 పోస్టులను సూపర్‌న్యూమరరీ కింద ఏర్పాటు చేసింది. వివిధ కేటగిరీల వారీగా రెవెన్యూ, నీటిపారుదల, పురపాలక, మిషన్‌ భగీరథ శాఖలకు కేటాయిస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్హతలను అనుసరించి మూడు కేడర్లలో సర్దుబాటు చేయనున్నారు.

మంజూరు చేసిన పోస్టుల్లో అత్యధికంగా రెవెన్యూశాఖకే కేటాయించడంతో వీఆర్‌ఏలు ఎక్కువ మంది మాతృశాఖలోనే విధులు నిర్వర్తించనున్నారు. జూనియర్‌ అసిస్టెంట్‌, రికార్డ్‌ అసిస్టెంట్‌, ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టులు కలిపి 5,243 కేటాయించారు. ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టుల కింద నీటిపారుదల శాఖకు 5,073 పోస్టులు  కేటాయించారు. పురపాలక సంఘాల్లో వార్డు ఆఫీసర్లుగా జూనియర్‌ అసిస్టెంట్‌ కేటగిరీలో వీఆర్‌ఏలను తీసుకుంటున్నారు. మొత్తం 1,266 పోస్టుల్లో ఎక్కువగా రంగారెడ్డి జిల్లాకు 115, మేడ్చల్‌ మల్కాజిగిరికి 90, సంగారెడ్డికి 75, కరీంనగర్‌కు 74, నల్గొండ జిల్లాకు 62 పోస్టులు కేటాయించారు. మిషన్‌ భగీరథ నీటి పంపిణీ సేవలను సమర్థంగా నిర్వహించేందుకు 3,372 హెల్పర్‌ పోస్టులను (సహాయకులు) కేటాయించారు.

Read more RELATED
Recommended to you

Latest news