పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బుమ్రా భార్య!

-

ఫ్యాన్స్ కు అదిరిపోయే శుభవార్త చెప్పాడు జస్‌ప్రీత్‌ బుమ్రా. టీమిండియా స్టార్ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా తండ్రి అయ్యాడు. ఇవాళ ఉదయం జస్‌ప్రీత్‌ బుమ్రా భార్య సంజన గణేషన్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.

bumrah
bumrah

ఈ శుభవార్తను జస్‌ప్రీత్‌ బుమ్రా స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అలాగే తన కుమారుడి పేరు కూడా పెట్టేశారు జస్‌ప్రీత్‌ బుమ్రా. అంగద్ బుమ్రా ఈ ప్రపంచంలోకి స్వాగతం పలుకుతున్నట్లు తన సంతోషాన్ని తన అభిమానులతో పంచుకున్నాడు.కాగా, ఇవాళ టీమ్ ఇండియా వర్సెస్ నేపాల్ జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. ఆసియా కప్ టోర్నమెంట్ 2023లో భాగంగా టీమిండియా మరియు నేపాల్ జట్ల మధ్య ఐదవ మ్యాచ్ పల్లె కెళ్లే వేదికగా జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news