భారత్‌లో జరగనున్న G-20 సదస్సుకు హాజరు కాకూడదని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. సదస్సుకు తన ప్రతినిధిగా చైనా ప్రీమియర్ లి కియాంగ్‌ను పంపాలని జిన్‌పింగ్ నిర్ణయించుకున్నారు. వాస్తవానికి భారత్ వస్తానని గతంలో జిన్‌పింగ్ ప్రకటించారు.
కానీ, గురువారం చైనా విదేశాంగ శాఖ నిర్వహించిన సాధారణ ప్రెస్‌మీట్‌లో అధికారులు ఈ పర్యటన గురించి కచ్చితంగా చెప్పలేకపోవడం.. మరుసటి రోజే జిన్‌పింగ్ ఈ ఏడాది జీ20కి హాజరుకాకూడదని నిర్ణయించుకున్నట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయి. అయితే తాజాగా ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ స్పందించారు. జీ-20కి హాజరుకాకూడదన్న జిన్‌పింగ్ నిర్ణయం తనను నిరాశ పరిచిందని బైడెన్ తెలిపారు.
దీనిపై బైడెన్ మాట్లాడుతూ.. జిన్‌పింగ్ నిర్ణయంతో తాను నిరుత్సాహానికి గురయ్యానని అన్నారు. కానీ, తాను ఆయనను కలిసేందుకు వెళుతున్నానని చెప్పారు. వీరి సమావేశం ఎక్కడ జరుగుతుందనే సమాచారం మాత్రం వెల్లడించలేదు. సెప్టెంబర్ 7-10 మధ్యలో బైడెన్ జీ20 సదస్సు పర్యటన జరుగుతుంది. అనంతరం వియత్నాంలో పర్యటించనున్నారు.