కర్ణాటకలో JDS​-BJPకి కుదిరిన దోస్తీ.. పొత్తు ఖరారు

-

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో ఘోర పరాజయం చవిచూసిన బీజేపీ, జేడీఎస్ త్వరలోనే జట్టు కట్టనున్నాయనే ప్రచారానికి ఎండ్ కార్డ్ పడింది. కాషాయ దళంతో కలిసి పని చేయనున్నట్లు జేడీఎస్ అగ్రనేత హెచ్ డీ కుమార స్వామి ప్రకటించారు. కర్ణాటకలో బీజేపీతో కలిసి ప్రతిపక్షంగా పనిచేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. బీజేపీతో పొత్తు కుదుర్చుకునే విషయంలో.. తుదినిర్ణయం తీసుకునే అధికారం జేడీఎస్‌ అధినేత, మాజీ ప్రధాని హెచ్​డీ దేవెగౌడ తనకు అప్పగించినట్లు చెప్పారు.

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయేతో జేడీఎస్‌ జట్టు కట్టనుందన్న ప్రచారం మధ్య గురువారం రాత్రి జరిగిన ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో జరిగిన చర్చలపై అడిగిన ప్రశ్నకు.. కుమారస్వామి ఈ మేరకు స్పందించారు. కర్ణాటకలో జేడీఎస్‌, బీజేపీ ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నాయని.. అందుకే కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. దేశ ప్రయోజనాల కోసం బీజేపీతో చేతులు కలుపుతున్నామని  అన్నారు. శుక్రవారం విధానసౌదలో తన కార్యాలయంలో మాజీ సీఎం బసవరాజ బొమ్మైతో కలిసి కుమారస్వామి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీతో కలిసి జతకట్టడంపై ప్రకటన చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news