జియో మరో రికార్డు.. తెలుగు రాష్ట్రాలలో 3.27 లక్షల మంది కొత్త కస్టమర్లు చేరిక..

-

జియో వచ్చిన కొద్ది రోజులకే మంచి రికార్డులను అందుకుంది..ఎంతో మంది జియోకు మారారు.. ఇటీవల జియో ప్లాన్స్ కూడా పూర్తిగా మారడంతో మరి కొంతమంది జియో ప్లాను కు మారిపోయారు. కాగా, తాజాగా మరో నివేదికను జియో విడుదల చేసింది.టెలికాం రెగ్యులేటరీ సంస్థ TRAI విడుదల చేసిన తాజా సబ్‌స్క్రైబర్ డేటా ప్రకారం, మే 2022 నెలకు గాను రిలయన్స్ జియో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో 3.27 లక్షల మంది కొత్త కస్టమర్లను చేర్చుకుంది.

ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో రిలయన్స్ జియో అత్యధికంగా 3,27,020 మంది కొత్త సబ్‌స్క్రైబర్‌లను చేర్చుకుంది..ఇక ఇదే నెలలో భారతీ ఎయిర్‌టెల్ 71,312 మొబైల్ కస్టమర్లను చేర్చుకుంది. మరోవైపు వోడాఫోన్ ఐడియా 74,808 మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోగా, ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL 78,423 మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది.

దేశ వ్యాప్తంగా రిలయన్స్ జియో మే నెలలో 31.11 లక్షల వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్‌లను సంపాదించి, భారతీయ టెలికాం మార్కెట్లో తన ఆధిక్యాన్ని మరింతగా పెంచుకుంది. ఫలితంగా దేశవ్యాప్తంగా జియో మొత్తం మొబైల్ కస్టమర్ల సంఖ్య ఇప్పుడు 40.87 కోట్లకు చేరుకుంది.

భారతీ ఎయిర్‌టెల్ దేశవ్యాప్తంగా 10.27 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లను చేర్చుకుంది. దాంతో సంస్థ మొత్తం మొబైల్ వినియోగదారుల సంఖ్య 36.21 కోట్లకు చేరుకుంది. అదే విధంగా వోడాఫోన్ ఐడియా సబ్‌స్క్రైబర్‌ల సంఖ్య ఈ నెలలో 7.59 లక్షలు తగ్గి 25.84 కోట్లకు పడిపోయింది. BSNL వినియోగదారుల సంఖ్య కూడా దాదాపు 53.62 లక్షలు తగ్గి 11.28 కోట్లకు పడిపోయింది.ప్రస్తుతం మొదటి స్థానంలో జియో ఉంది.. ఈ విషయం పై జియో అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.త్వరలోనే మరిన్ని ఆఫర్లను అందించనున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version