ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఐపీఎల్ సీజన్ 18 పురస్కరించుకుని యూజర్ల కోసం ‘అన్‌లిమిటెడ్’ ఆఫర్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ఆఫర్ ను పొడిగించింది. 90 రోజుల ఫ్రీ జియో హాట్‌స్టార్, జియో ఫైబర్‌పై 50 రోజుల ఫ్రీ ట్రయల్ ఆఫర్ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మొదట మార్చి 31 వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందని ప్రకటించగా.. తాజాగా దాన్ని తాజాగా ఏప్రిల్ 15వ తేదీ వరకు పొడిగించింది.
ఐపీఎల్ మ్యాచ్‌లను ఉచితంగా చూసేందుకు రిలయన్స్ జియో మార్చి 17వ తేదీన.. రూ.299, అంతకంటే ఎక్కువ మొత్తంతో రీఛార్జి చేస్తారో వారికి 90 రోజుల పాటు జియో హాట్‌స్టార్‌ను ఉచితంగా అందిస్తామని ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. మొబైల్ డివైజులతో పాటు టీవీల్లోనూ వీక్షించే అవకాశం కల్పించింది. ప్రస్తుత కస్టమర్లతో పాటు కొత్తగా చేరే కస్టమర్లకూ ఈ ఛాన్స్ కల్పిస్తున్నట్లు తెలిపింది. అన్‌లిమిటెడ్ ఆఫర్‌లో భాగంగా జియో ఫైబర్ లేదా జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్ తీసుకునే వారికి 50 రోజుల ఫ్రీ ట్రయల్ ఆఫర్ అందిస్తున్న విషయం తెలిసిందే.