సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ మానిక్రావ్ ఖాన్విల్కర్ లోక్‌పాల్ ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. తాజాగా లోక్‌పాల్ చైర్‌పర్సన్‌తో పాటు సభ్యులుగా నియమితులైన ఆరుగురి పేర్లను రాష్ట్రపతి భవనం విడుదల చేసింది. జస్టిస్ ఖాన్విల్కర్‌ను లోక్‌పాల్ చైర్‌పర్సన్‌ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ నియమించారు. మాజీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లింగప్ప నారాయణ స్వామి, జస్టిస్ సంజయ్ యాదవ్ , జస్టిస్ రితు రాజ్ అశ్వతీలను లోక్‌పాల్ న్యాయ సభ్యులుగా నియమిస్తున్నట్లు రాష్ట్రపతి తెలిపారు. అవినీతి నిరోధక అంబుడ్స్‌మన్‌లో సుశీల్ చంద్ర, పంకజ్ కుమార్ , అజయ్ టిర్కీ నాన్ జ్యుడీషియల్ సభ్యులుగా నియమితులయ్యారు.
కేంద్ర స్థాయిలో లోక్‌పాల్‌ను, రాష్ట్ర స్థాయిలో లోకాయుక్త నియామకానికి ఉద్దేశించిన లోక్‌పాల్, లోకాయుక్త చట్టం 2013లో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. పబ్లిక్ సర్వెంట్లలో కొన్ని విభాగాల వారిపై వచ్చే అవినీతి కేసులపై దృష్టిపెట్టడం వీటి కర్తవ్యం. లోక్‌పాల్ కమిటీలో ఒక ఛైర్‌పర్సన్, గరిష్ఠంగా 8 మంది సభ్యులు ఉంటారు. వీరిలో నలుగురు జ్యుడిషియల్ సభ్యులై ఉండాలి. లోక్‌పాల్ ఛైర్‌పర్సన్, సభ్యులను రాష్ట్రపతి స్వయంగా నియమిస్తారు. ప్రధానమంత్రి నాయకత్వంలో గల ఎంపిక కమిటీ సిఫారసుల మేరకు ఈ నియామకాన్ని రాష్ట్రపతి చేపడతారు.