భూ కుంభకోణం మనీ లాండరింగ్ కేసుల్లో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కి అరెస్టు తప్పేలా లేదు.. ఈ క్రమంలో జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా ఆయన సతీమణి కల్పనా సోరెన్ బాధ్యతలు చేపట్టనున్నారని ప్రచారం జరుగుతుంది.. తాను అరెస్ట్ అయితే.. తన భార్య పాలనా పగ్గాలు తీసుకుంటారని అనుచరుల వద్ద హేమంత్ సోరెన్ చెప్పారని వార్తలు వస్తున్నాయి.
భూ కుంభకోణం మనీలాండరింగ్ కేసుల్లో హేమంత్ సోరెన్ కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు గాలిస్తున్నారు.. ఈ క్రమంలో ఆయన అదృశ్యమయ్యారనే వార్తలు వచ్చాయి.. అయితే తాను ఎక్కడికి పోలేదని రాంచీలోనే ఉన్నానని.. బుధవారం మధ్యాహ్నం విచారణకు హాజరవుతారని హేమంత్ సోరెన్ ప్రకటించారు..
ఈడి అధికారులు ఝార్ఖండ్ సీఎం గా ఉన్న హేమంత్ ను అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. తాను ఒకవేళ అరెస్టు అయితే తన భార్య కల్పన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటారని.. అందరూ సహకరించాలని ముఖ్య నేతలకు ఆయన విజ్ఞప్తి చేశారట. ఎమ్మెల్యేలందరూ రాజధాని లోనే ఉండాలని సూచించారట.. 81 మంది సభ్యులు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీలో జేఎంఎం 31 మంది, కాంగ్రెస్కు 16 మంది సభ్యులు ఉన్నారు.. సోరెన్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేస్తే.. జార్ఖండ్లో రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి..